తెలంగాణ
బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి

మహిళల ఇంటిపై దాడులు చేయమని శ్రీరాముడు చెప్పాడా, ఏ దేవుడు చెప్పాడని బిఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ అన్నారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో బిజెపి, బిజెవైఎం నాయకులు తన ఇంటిపై దాడికి యత్నించారని ఆరోపించారు. ఈ విషయం పై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
బండి సంజయ్ నాయకత్వంలో జిల్లాలో దాడుల సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎప్పుడు ఇటువంటి దాడులు చేయలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండడం సహజమే కానీ ఈ దాడుల సంస్కృతి ఏంటని ప్రశ్నించారు.



