జాతియం
బిహార్లో పడవ ప్రమాదం..13 మంది మృతి

బిహార్లో గంగా నదిలో ఘోర పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వైశాలి జిల్లాలోని రాంపూర్ శ్యామ్చంద్ గ్రామం సమీపంలో పడవ బోల్తా పడిన ఘటనలో 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతులంతా 15 ఏళ్లలోపు వారే కావడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
మరోవైపు పలువురు గల్లంతైనట్లు తెలుస్తుండటంతో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి.



