ఆంధ్ర ప్రదేశ్
ఐఏఎస్ ఆర్ణ వీడియోపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో ‘ఐఏఎస్ ఆర్ణ’గా ఎంతో గుర్తింపు పొందిన ఓ చిన్నారి పోస్ట్ చేసిన వీడియోపై ఏపీ సీఎం చంద్రబాబు సరదాగా స్పందించారు. ఈ వీడియోను చూసి నవ్వకుండా ఉండలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. చిన్నారి ఆర్ణకు తన పూర్తి మద్దతు ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల ఆర్ణ తండ్రి తన కుమార్తెకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నటుడు వెంకటేశ్ సినిమాలోని డైలాగులను బ్యాక్గ్రౌండ్లో జతచేసి ఈ వీడియోను రూపొందించారు. తన క్యూట్ హావభావాలతో ఆర్ణ ఆకట్టుకోవడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. లక్షలాది మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి మురిసిపోయారు.ముఖ్యమంత్రి స్పందనతో ఈ వీడియో ఇప్పుడు మరింతగా ట్రెండ్ అవుతోంది.



