జాతియం

లోక్‌సభలో 3 కీలక బిల్లులు…వాడివేడిగా చర్చ

లోక్‌సభలో మూడు కీలక బిల్లులపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పోటాపోటీగా మహిళా రిజర్వేషన్ గెజిట్ విడుదలపై కాంగ్రెస్ ప్రశ్నలు కురిపించింది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా సవరణ బిల్లు ఎలా ప్రవేశపెట్టారని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు.

తమిళనాడుకు కేంద్రం ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలేదని కనిమొళి విమర్శించారు. కేంద్రం క్యాలిక్యూలేటెడ్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతోందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగానే.. నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు.

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని మోడీ, అమిత్‌షా మాట్లాడుతున్నారు కానీ.. మోడీ, అమిత్‌షా మాటలకు విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు రూపొందించారని విమర్శించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలు మరింత నష్టపోతాయన్నారు.

దేశాన్ని నిర్మించేలా డీలిమిటేషన్ ప్రక్రియ ఉండాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా డీలిమిటేషన్ మారవద్దన్నారు. ఏపీ పునర్విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక హోదా హామీ చట్టంలో లేదని అమలు చేయడం లేదన్నారు .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button