బికినీతో సోషల్ మీడియాని బద్దలు కొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ!

బిగ్ బాస్ ఫేమ్ దివి ఎప్పుడూ చూడని బోల్డ్ అవతార్‌లో కనిపించింది. బ్లూ బికినీలో సముద్రతీర ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ధైర్యానికి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
బిగ్ బాస్ బ్యూటీ దివి ఒక్కసారిగా అదిరిపోయే గ్లామర్ షోతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సముద్రతీరంలో బ్లూ కలర్ బికినీలో ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. గతంలోనూ గ్లామర్ చూపినా ఈసారి అంతకుమించిన బోల్డ్నెస్ ప్రదర్శించడం వెనుక కారణం ఏమిటని చర్చ జరుగుతోంది. ఇది సినిమా అవకాశాల కోసమో, గ్లామర్ షో కోసమో కాదు. తనకు తాను ఇచ్చిన స్వేచ్ఛా ప్రకటనలా కనిపిస్తోంది.
“నా శరీరం.. నా ఇష్టం.. నా కాన్ఫిడెన్స్” అని ధైర్యంగా చాటుతోంది. ఈ మార్పుకు ట్రోల్స్ రావొచ్చనే భయం పక్కనపెట్టి, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడిన దివిని నెటిజన్లు భారీగా ప్రశంసిస్తున్నారు. ఆమె అద్భుతమైన ఫిట్నెస్, ధైర్యం చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇక ఈ కొత్త అవతారం సినిమా ఇండస్ట్రీలోనూ మంచి అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.



