జాతియం
సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం

ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిటిషనర్ ఆరోపించారు. FDTL రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయని పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రయాణికుల హక్కులను ఇండిగో ఉల్లంఘించిందని పిల్ దాఖలు చేశారు. ఇండిగో విమానాల సంక్షోభాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నారు సీజేఐ.



