జాతియం
Rajasthan: టిప్పర్ బీభత్సం.. 11 మంది మృతి, 50 మందికి గాయాలు

Rajasthan: రంగారెడ్డి ప్రమాదం మరవకముందే రాజస్థాన్‌లో మరో యాక్సిడెంట్ జరిగింది. జైపూర్ దగ్గర టిప్పర్ బీభత్సం సృష్టించింది. వాహనాలపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 50 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ ఢీకొట్టడంతో 17 వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



