జాతియం

Indian-Pakistan: శత్రువు గడ్డపైనే భారత్ సత్తా

Indian-Pakistan: మాది అణ్వస్త్ర దేశం. ఇండియాను ఈజీగా ఓడిస్తాం. ప్రపంచంలో మా దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతామంటూ పాకిస్తాన్ పాలకులు ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు. తమను తాము ఎక్కువగా ఊహించుకోవడంలో వాళ్లకు వాళ్లే సాటి. దాయాది పాలకుల తర్వాతే ఇంకెవరైనా..! ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చూడా అణ్వాయుధాల గురించి ప్రగాల్భాలు పలికారు. సిందూ నదిపై భారత్ ఏ ఒక్క కట్టడం కట్టినా దానిని అణుబాంబులతో నాశనం చేస్తామంటూ కారు కూతలు కూసింది.

కానీ పాక్ పాలకుల మాటలొకటి ఆ ప్రభుత్వం బయటపెట్టిన నివేదికలో మరొకటి. ఇండియా యుద్ధానికి దిగితే పాకిస్తాన్ తోకముడుచుకొని పారిపోవాల్సిందే. ఇందుకు నిదర్శనమే తాజాగా వెలుగులోకి వచ్చిన ఆ నివేదిక ఇంతకీ ఆ నివేదికలో ఏముంది..? ఆ నివేదికను చూసి పాకిస్తాన్ పాలకుల గుండెల్లో ఎందుకు వణుకుమొదలైంది.

ఉగ్రవాదానికి కర్త, కర్మ, క్రియ అన్నీ పాకిస్థానే. ఉగ్ర గ్రూపులకు ఆయుధాలు, నిధులను అందించింది. ఆశ్రయమిచ్చింది. కశ్మీర్‌ను సొంతం చేసుకోవాలని కలలు కంది. భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పింది. పహల్గాంలో ఉగ్రదానికి పాల్పడింది. 26మంది అమాయకులను పొట్టనపెట్టుకుంది. మాది మాది అణ్వస్త్ర దేశం. ఇండియాను ఈజీగా ఓడిస్తామని సవాళ్లు విసిరేది. మతం అడిగి మరి మారణహోమం సృష్టించింది. టూరిస్టులను చంపి మీ మోదీ కి చెప్పుకోమంటూ సవాల్ విసిరింది.

దీంతో భారత్ సర్కార్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ గుండెల్లో వణుకుపుట్టింది. ఆపరేషన్ సింధూర్‎లో భాగంగా పాకిస్థాన్‎తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరెపు దాడులతో విరుచుకుపడింది. మిస్సైళ్లు, డ్రోన్లతో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాయాది పాకిస్థాన్ గజ్జున వణికింది. భారత్ ఎక్కడ దాడి చేస్తుందోనన్న భయంతో వణికిపోయింది.

ఇండియన్ ఆర్మీ ముందు పాక్ మూడు రోజుల్లోనే చెతులెత్తేసింది. అన్నిరకాలుగా కూడా అష్టదిగ్బంధనం చేసి భారత్ జోలికి రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ భారత్ ఆర్మీ తో మాట్లాడి సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుందామని ముందు ప్రతిపాదన తీసుకొచ్చారు. దీంతో ఇండియన్ ఆర్మీ దీనికి అంగీకరించింది. అప్పటి నుంచి భారత్,పాక్ ల మధ్య బార్డర్ లో కాల్పులు జరగలేదు. కానీ పాక్ ఆర్మీ ఛీఫ్ మాత్రం మరోసారి తమ వంకర బుద్దిని బైటపెట్టారు.

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌ భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్నారు. సింధూ నదిపై భారత్ డ్యామ్‌ కడితే క్షిపణులతో కూల్చివేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ తమ జీవనాడి అని మరోసారి బీరాలు పలికారు. ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి పాక్ అస్థిత్వానికి ముప్పు ఎదురైతే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

పాకిస్తాన్ అణుబాంబుల గురించి మట్లాడడం కొత్తేమీ కాదు మనం దశాబ్దాలుగా ఇది వింటూనే ఉన్నాం వాళ్ల కమాండర్స్ ప్రతీ సారి భారత్‌ను బెదిరిస్తూనే ఉన్నారు. సింధూ నదిపై భారత్ ఏదైన కట్టాలు చేస్తే అణు బాంబులు సైతం వేయడానికి వెనకాడమని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. ఈ బెదిరింపులకు భారత్ ఇచ్చిన సమాధానం కేవలం ఒక ప్రకటన కాదు. అది పాకిస్తాన్ గుండెల్లో బయంకరమైన ప్రకంపన అది ప్రపంచాన్ని నిశబ్ధంగా గమనించమని చెప్పిన ఓ శక్తివంతమైన మేసేజ్.

కానీ అసలు కథ ఇప్పుడు మొదలైంది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం పాక్ ప్రభుత్వానికి సమర్పించిన ఒక నివేధిక వారిని బయంకరంగా వణికిస్తుంది. మంచులో గడ్డ కట్టిన రక్తంలా పాకిస్తాన్ మణుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఆ నివేదికలోని ప్రతి పదం పాకిస్తాన్ భవిష్యత్ పై రాసిన ఒక మృత్యుశాసనంలా కనిపిస్తుంది.

ఆ రిపోర్ట్ ఏం చెబుతుందంటే భారత్ పై ఎలాంటి దురాచాలు, దాడులు చేసిన ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం పూర్తిగా తూడిచిపెట్టుకుపోతుంది. భారత్ ఎప్పుడు నిశబ్ధంగా లేదని పాకిస్తాన్ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుందని ఆ నివేదిక బయంకరమైన నిజాలను బయటపెట్టింది. వేలాది మంది భారతీయ సైనికులు పక్కా వ్యూహాంతో స్లీపర్ సెల్ లా పాకిస్తాన్ లో నివాసం ఉంటున్నారట.

వీళ్లు మాములూ సైనికులు కాదు వీళ్లు భారత్ శిక్షణ పొందిన చిరుతలు. వీరు పాకిస్తాన్ సమాజంలో నిశబ్ధంగా ఆజ్ఞతవాసం చేస్తున్నారు. వారు మారువేశంలో బతుకుతున్నారు. పాకిస్తాన్‌లో ఒక భాగంలా కలిసిపోయారు. కానీ వారి గుండెల్లో మాత్రం భారత్ కోసం నిప్పురాజుకుంటుంది. వాళ్లు నిశబ్ధంగా ఉన్న అగ్నిపర్వతాలు. ఒక చిన్న నిప్పురవ్వ చాలు ఆ అగ్నిపర్వతాలు బద్ధలవ్వడానికి.

పాక్ ఆర్మీ భారత్ పై ఎలాంటి చర్య తీసుకునే ఆలోచన చేసినా తమ సొంతగడ్డపైనే ముందుగా బయంకరమైన అల్లకల్లోలం జరగడం కాయమని ఆ నివేదిక స్పష్టం చేసింది. బయట శత్రువుల కోసం చూసేలోపు వారి లోపలే దాగి ఉన్న భారత సైనికులు పాకిస్తాన్ ను నాశనం చేయడానికి వేయ్యి కల్లతో ఎదురుచూస్తున్నారు.

ఆ నివేదిక తెలిపింది. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు ఇది పాకిస్తాన్ ఉనికిని నిలబెట్టుకోవడానికి చివరి అవకాశం. భారత్ ను తక్కువ అంచనా వేస్తే వారి భౌగోళిక ఉనికినే నాశనంచేసే శక్తి భారత్‌కు ఉందని ఈ రిపోర్ట్ ప్రపంచానికి చాటి చెబుతుంది.

భారత సైనికులు సరిహద్ధులోనే కాదు శత్రువుల గడ్డపై వారి గుండెల్లోనే నిద్రపోతున్నారని ఈ నివేదిక నిరూపించింది. శత్రువుల కళ్లు పీకేయడానికి భారత్ గడ్డపైనే ఉండాల్సిన అవసరం లేదు. శత్రువుల గడ్డపై నుంచే వాళ్ల కళ్లుపీకేయగల సత్తా భారత్ కు ఉందని ఈ రిపోర్ట్ ప్రపంచానికి చాటి చెబుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button