ఆంధ్ర ప్రదేశ్
Tummala: విత్తన ముసాయిదా బిల్లుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

Tummala: కేంద్రం తీసుకువచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించే విధంగా కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు ఉందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు 2025పై రాష్ట్రా స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొ్న్న మంత్రి ప్రసంగించారు. ముసాయిదా బిల్లుపై సర్టిఫికేషన్ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలన్నారు. నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపాలన్నారు.



