తెలంగాణ
Mynampally Hanumanth Rao: భాషను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ కుటుంబందే.. మైనంపల్లి ఫైర్

Mynampally Hanumanth Rao: బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మైనంపల్లి హన్మంతరావు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నాయకులను కొనుగులు చేసింది మీరు కదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రులను డబ్బులు ఇచ్చి కొన్నది మీరు కదా అని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడే భాషను భ్రష్టుపట్టించారని అన్నారు. భాషను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ కుటుంబాకే దక్కుతుందని అన్నారు. తండ్రి పేరు చెప్పుకుని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు.



