Priyanka Chopra: ‘వారణాసి’బడ్జెట్ రివీల్ చేసిన ప్రియాంక!

Priyanka Chopra: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమా గురించి ఆమె కపిల్ శర్మ షోలో కీలక విషయం వెల్లడించారు. ఈ చిత్రం టాలీవుడ్లో అత్యధిక బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి – సూపర్‌స్టార్ మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రం హాలీవుడ్ స్థాయిలో నిర్మాణమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇటీవల ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఈ చిత్రం బడ్జెట్ గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. ‘వారణాసి’ని రూ.1,300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇది టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ కాగా, రాజమౌళి కెరీర్లోనూ అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది.
ప్రస్తుతం భారతీయ చిత్రాల్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం పార్ట్ 1’ రూ.2,000 కోట్లకుపైగా బడ్జెట్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ‘వారణాసి’ ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. సంగీతం కీరవాణి అందిస్తుండగా, కథ విజయేంద్రప్రసాద్, సంభాషణలు దేవా కట్టా రాస్తున్నారు.



