సినిమా

Shivaji: ఆడబిడ్డలకు క్షమాపణలు

Sivaji: దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు శివాజీ మరోసారి క్షమాపణలు చెప్పారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఆడ బిడ్డలందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఈవెంట్ ముగిసిన వెంటనే తాను చేసిన తప్పును గ్రహించానని, హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యల ఉద్దేశానికి కట్టుబడి ఉన్నప్పటికీ, ఆ సందర్భంలో రెండు అసభ్య పదాలు వాడటం మాత్రం తప్పేనని అంగీకరించారు.

వేదికపై ఉన్న తోటి నటీనటులు, మహిళల మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు. 30 ఏళ్ల సినీ జీవితంలో కానీ, రాజకీయాల్లో కానీ తాను ఎప్పుడూ హద్దులు మీరి మాట్లాడలేదని, అలాంటి మాటలు తన నోట దొర్లడం పట్ల తీవ్రంగా బాధపడ్డానన్నారు. ఈ కారణంగానే సినిమా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని, తర్వాత స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

సినిమాకు పారితోషికం తీసుకున్నందున తన వంతు ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొంటూ, ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌లో ‘దండోరా’ సినిమాను చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం సమాజంలో ఉన్న కులవ్యవస్థ వంటి అసమానతలను గట్టిగా ప్రశ్నిస్తుందని, అలాంటి మంచి కథతో ఈ సినిమాను రూపొందించారని శివాజీ వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button