ఆంధ్ర ప్రదేశ్
TTD: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు

TTD: ప్రక్షాళన దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. తాజాగా అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది. ఇందుకుసంబంధించి టీటీడీ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా టీటీడీ ఆలయాలు, ఉత్సవాల సేవల్లోనూ.. అన్యమత ఉద్యోగులను నియమించరాదని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే 18 మంది అన్యమత ఉద్యోగస్తులకు.. పరిపాలన శాఖలో విధులు కేటాయించారు. 1989 ఎండోమెంట్ యాక్ట్ జీవో నెంబర్ 1060లో 9వ నిబంధన అమలు చేసింది టీటీడీ. 2024 నవంబరులో టీటీడీ బోర్డు తీసుకున్న తీర్మానం అనుగుణంగా చర్యలు చేపట్టింది.