ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు.
కొత్త సంవత్సరం సందర్భంగా స్వామివారి వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.



