News
శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ చోరీ యత్నం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో హుండీ చోరీ యత్నం కలకలం రేపింది. భక్తుడి వేషంలో ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ప్రధాన హుండీలోని నగదును అపహరించేందుకు ప్రయత్నించగా, అప్రమత్తంగా ఉన్న ఆలయ సిబ్బంది అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హుండీ నగదుతో నిండిపోయి ఉండడాన్ని గమనించిన నిందితుడు చోరీకి యత్నించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 10 వేల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
రాజమండ్రి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అతడిని గుర్తించిన అధికారులు, వెంటనే టెంపుల్ ఎస్‌పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎస్‌పీఎఫ్ సిబ్బంది అనంతరం వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఘటన అనంతరం ఆలయ భద్రతా ఏర్పాట్లపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.



