ఆంధ్ర ప్రదేశ్
రైతులకు మద్దతుగా కమలాపురంలో వైసీపీ ర్యాలీ

రైతులకు మద్దతుగా కమలాపురం వైసీపీ పార్టీ కార్యాలయం నుండి వ్యవసాయ కార్యాలయం వరకు వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఇంచార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి పాల్గొన్నారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
ప్రజల తరుపున ప్రతిపక్షంగా తమకు పోరాడే హక్కు ఉందని, ప్రభుత్వం దృష్టికి ప్రజలు, రైతుల సమస్యలను తీసుకెళ్ళే బాధ్యత తమపై ఉందని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.అనంతరం వ్యవసాయ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



