తెలంగాణ
Bandi Sanjay: పంజగుట్ట దుర్గ భవాని ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

Bandi Sanjay: సోమనాథ్ ఆలయ చరిత్రను గొప్పతనాన్ని స్మరించుకుంటూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ్–2026 సందర్భంగా హైదరాబాద్లోని పంజగుట్ట దుర్గ భవాని ఆలయాన్ని సందర్శించిన ఆయన శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని.. ఈ దేవాలయాన్ని రక్షించేందుకు ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించారన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడానికే ఈ సోమనాథ్ స్వాభిమాన పర్వ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.



