Jagadish Reddy: సీఎం రేవంత్ మూర్ఖత్వం, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు

Jagadish Reddy: సీఎం రేవంత్ మూర్ఖత్వం, అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి అయ్యానన్న సోయిలేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. SLBC విషయంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా ప్రజల నడ్డివిరిచింది వాళ్లేనని ఆరోపించారు.
దేశంలోనే అత్యధికంగా ఒక జిల్లా నుంచి వలసపోయింది పాలమూరు నుంచేనని చెప్పారు. కృష్ణా నీళ్ల పంపిణీపై ట్రిబ్యునల్ వేయాలని కేసీఆర్ పోరాడారని కేంద్రప్రభుత్వం దగ్గర ప్రతి వేదికలో కేసీఆర్ పోరాటం చేశారని తెలిపారు. గతేడాది 250 టీఎంసీలు కూడా వాడలేదని కృష్ణా బోర్డు గుర్తుచేసిందని చెప్పారు. 60 ఏళ్లు పాలన చేసినోళ్లు కేసీఆర్ పై బాధ్యత నెడుతున్నారని అన్నారు. కృష్ణా జలాల్లో వాటాలపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో ఇచ్చిందని జగదీశ్ రెడ్డి తెలిపారు.



