క్రీడలు

Asia Cup 2025: పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం

Asia Cup 2025: అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పాక్ పై మ‌రోసారి భార‌త్ త‌న దూకుడును ప్రద‌ర్శించింది. అన్ని రంగాల్లో డామినెట్ చేసిన టీమిండియా టోర్నీలో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. అనుకున్నట్లుగానే పాకిస్థాన్ పై భార‌త్ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించింది. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై అన్ని విభాగాల్లో సత్తా చాటి త‌న మార్కును చూపించింది.

భార‌త అభిమానుల మ‌న‌సు పుల‌క‌రించేలా పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. దాయాదుల స‌మ‌రంలో మ‌రోసారి పాకిస్థాన్ పై భారతే పై చేయి సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జ‌రిగిన ఆసియా క‌ప్ లీగ్ మ్యాచ్ లో భార‌త్ అద్భుత విజ‌యం సాధించింది. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన యువ టీమిండియా పాక్ ను 7 వికెట్లతో మ‌ట్టిక‌రిపించింది.

అంత‌కుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ ను బ్యాటర్లు నిరాశ ప‌ర్చారు. భార‌త‌బౌల‌ర్ల ధాటికి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లకు 127 ప‌రుగులు మాత్రమే చేసింది. ఓపెన‌ర్ షాహిబ్ జాదా ఫ‌ర్హాన్ 40 పరుగులతో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో పాక్ ప‌త‌నాన్ని శాసించాడు. అనంత‌రం ఛేజింగ్ ను భార‌త్ ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసింది.

15.5 ఓవ‌ర్లలో 3 వికెట్లకు 131 ప‌రుగులు చేసి, సూప‌ర్-4లో దాదాపు బెర్త్ ను ఖ‌రారు చేసుకుంది. ‘సూర్య కుమార్ యాదవ్ 37 బంతుల్లో 47 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌల‌ర్లలో స‌యిమ్ అయూబ్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. త‌ర్వాత మ్యాచ్ లో ఒమ‌న్ తో భార‌త్, యూఏఈతో పాక్ త‌ల‌ప‌డుతాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button