తెలంగాణ
Hyderabad: చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు జప్తు నోటీస్

Hyderabad: హైదరాబాద్ చైతన్యపురిలోని మెట్రో రైలు స్టేషన్ వద్ద విద్యుత్తు సంస్థ జప్తు నోటీసు అంటించింది. 31 వేల 829 బకాయి ఉన్నట్లు అందులో పేర్కొంది. మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేటు పేరుతో 2015 జులై 23న మెట్రో పనుల కోసం విద్యుత్తు కనెక్షన్ తీసుకుంది. ఆ తర్వాత ఏజెన్సీ వెళ్లిపోయింది. 2021 డిసెంబరు నాటికి బకా యిపడిన వినియోగదారుల నుంచి వసూలుకు టీజీ ఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా సరూర్ నగర్ ఆపరేషన్స్ ఏఈ జప్తు నోటీసు మెట్రో స్టేషను అంటించారు. విద్యుత్తు కనెక్షన్ మెట్రో రైలు సంస్థ పేరున లేదు. కానీ మెట్రోకోసం పని చేసిన ఏజెన్సీ మెస్సర్స్ థేల్స్ చిరునామా, నంబరును కనుగొనడానికి అక్కడ జప్తు నోటీసు అంటించారని విద్యుత్తు ఉన్నతాధికారులు తెలిపారు. రోజూ ఈ స్టేషన్‌లో రాకపోకలు సాగించే ప్రయాణికులు జప్తు నోటీసును చూసి చర్చించుకుంటున్నారు.



