ఆంధ్ర ప్రదేశ్
గిరిజనులతో కలిసి డాన్స్ అదరగొట్టిన కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురంలో గిరిజనులు సాంప్రదాయ ప్రకారం జరుపుకునే కందికొత్తల పండగ ఘనంగా నిర్వహించారు. ఈ పండగకు సతీ సమేతంగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. గిరిజనులతో తుడుము కొట్టి నృత్యం చేసి అందరిని అబ్బురుపరిచారు కలెక్టర్.
గిరిజనులు సంప్రదాయంగా జరుపుకునే కందికొత్తల పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తానన్నారు. ఆదివాసీలు పండించే పంటలు బాగా పండి గిరిజనులు సంతోషంగా ఉండాలన్నారు.



