తెలంగాణ
హైదరాబాద్ అంబర్పేటలో కారు బీభత్సం

Amberpet: హైదరాబాద్ అంబర్పేటలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు దుకాణం ఎదుట ఉన్న ఆరు బైక్లను ఢీ కొట్టింది. ఘటన లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరు బైక్లు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు.