ఆంధ్ర ప్రదేశ్

అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య

అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. భర్త అరుణ్‌కుమార్ చిత్రహింసలు భరించలేక ఉరివేసుకొని శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడింది. అరుణ్‌కుమార్ అకృత్యాలను సూసైడ్ లెటర్‌లో శ్రీవిద్య వివరించింది. తల్లిదండ్రులకు భారం కాకూడదనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, శాడిస్ట్ భర్తను వదలొద్దని లెటర్‌లో శ్రీవిద్య రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఆరు నెలల క్రితం విలెజ్ సర్వేయర్ అరుణ్‌కుమార్‌తో శ్రీవిద్య వివాహం జరిగింది. పెళ్లై‌న కొద్దిరోజుల నుండే శ్రీవిద్యను శారీరకంగా అరుణ్‌కుమార్ హింసించాడు. ఆమెను మరో మహిళతో పోల్చుతూ నీచంగా తిట్టేవాడని, అంతేకాదు రోజు కొట్టేవాడని సూసైడ్ లెటర్‌లో శ్రీవిద్య రాసింది. తలను మంచానికి, తలుపుకి కొట్టడంతో భరించలేని తలనొప్పి వస్తుందని లెటర్‌లో శ్రీవిద్య ఆవేదనగా రాసింది. ప్రస్తుతం అరుణ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button