తెలంగాణ
Mahabubabad: డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని మృతి

Mahabubabad: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. సీరోలు మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా.. విద్యార్థిని రోజా వేదికపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది.
వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యార్థిని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా… అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థిని స్వగ్రామం మరిపెడ మండలం సపవత్ తండాగా గుర్తించారు. విషయం తెలియడంతో బాధిత విద్యార్థి పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.