తెలంగాణ
Hyderabad: దారుణం.. పిల్లల ముందే భార్యకు నిప్పు పెట్టిన భర్త

Hyderabad: హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కూతురిని కూడా మంటల్లో తోసేసి పరారయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్, త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. త్రివేణి ఎక్కడికి వెళ్లినా.. వెంకటేష్ అనుమానిస్తుండే వాడు. ఈ క్రమంలోనే త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు వెంకటేష్.



