News
జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకుంది ఎన్టీఏ.పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్ష పారదర్శకతకు భంగం కలిగిందని భావించిన ఎన్టీఏ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రీ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది.
జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్లీ నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. త్వరలోనే కొత్త అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.



