తెలంగాణ

Stray Dogs: పిచ్చి కుక్కల స్వైర విహారం.. 20 మందిపై దాడి!

Stray Dogs: కామారెడ్డిలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేశాయి. పిచ్చికుక్కల దాడిలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. కుక్కల దాడిలో గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పిచ్చి కుక్కలను తరిమికొట్టాలంటూ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వార్డులలో పర్యటించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button