తెలంగాణ
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది వరద ఉద్ధృతి

నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది వరద ఉద్ధృతి కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వరదనీరు బాసర ఆలయ పరిసర ప్రాంతాలను, పుష్కర ఘాట్లను ముంచెత్తింది. ఆలయానికి వెళ్ళే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. మూడు లాడ్జ్‌లు, ఒక ప్రైవేట్ అతిథి గృహం వరద నీటిలో చిక్కుకున్నాయి.
బాసర ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి రక్షణ కార్యక్రమాలను చేపట్టాయి. వరద ప్రవాహం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.



