తెలంగాణ
తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ అయ్యింది. ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అల్టర్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. మరోవైపు ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడతాయని.. వాతావరణ శాఖ హెచ్చరించింది.



