సినిమా

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్ ఎప్పుడంటే?

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవన్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా మొదట్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ షూటింగ్ ఎన్నోసార్లు వాయిదా పడుతూ రావడంతో ఆ జోష్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ మార్చి నుంచి మే నెలకు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ ఫ్యాన్స్‌ని బాగానే ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మూడో సాంగ్ గురించి ఓ లేటెస్ట్ బజ్ వైరల్‌గా మారింది. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ ఏప్రిల్ 10న మూడో పాటను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట.

అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది.ఈ భారీ ప్రాజెక్ట్‌కు కీరవాణి మ్యూజిక్ ఇస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుగుతోంది. ఇక వచ్చే మే 9న పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆరంభంలోని అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాల్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button