Swati Sachdeva: ఓ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వాతి సచ్‌దేవా

Swati Sachdeva: ఇటీవల యూట్యూబర్ రణ్‌వీర్ అల్లహాబాదియా, స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో స్టాండప్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్‌దేవా తాను ఊహించని విధంగా ఒక విషయంలో తన తల్లికి దొరికిపోయానని ఆ సమయంలో ఆమెతో మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఆమె ఏ విషయంలో దొరికిందో కూడా తెలిపింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీంతో నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనం ఎప్పుడూ చూడని అత్యంత భయంకరమైన కామెడీలలో ఇదీ ఒకటని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రేక్షకులను నవ్వించడానికి అసభ్యకర అంశాలను ఎంచుకోవడం సిగ్గుచేటని మరో నెటిజన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టాండప్ కామెడీ హద్దులు దాటుతోందని, షోలలో ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించకూడదని అన్నారు.