Kokapet: కోకాపేటలో చ.గజం రూ.1.75 లక్షలు

Kokapet: నగరంలో కీలకమైన ప్రాంతంగా పేరున్న కోకాపేటలో చ.గజానికి కనీస ధరను రూ.1.75 లక్షలుగా నిర్ణయించింది. గతంలో ఇది రూ.65 వేలుగా ఉండేది. అప్పట్లో ఓ స్థిరాస్తి సంస్థ కోకాపేటలో ఎకరా భూమి రూ.100 కోట్లకు దక్కించుకోవడం సంచలనం సృష్టించింది.
ఈ ప్రాంతంలో సర్వే నం.144లో ప్రభుత్వానికి 8,591 చ.గజాల భూమి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరను పరిగణనలోకి తీసుకుంటే విలువ సుమారు రూ.150 కోట్లు దాటుతుండగా..ఆన్‌లైన్ వేలంలో ధర ఎంతకు పోతుందోననే ఆసక్తి నెలకొంది.
గతంలో మోకిలలో ప్లాట్లను వేలంవేయగా చాలామంది రూ.లక్ష ధరావతు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. వందమందికిపైగా వేలందారులు చ.గజం ధరను రూ.లక్ష వరకు పెంచేసి, తర్వాత డబ్బులు కట్టడం మానేశారు. వేలం వేసిన భూమికి సమీపంలో ఉన్న తమ స్థలాల ధరలను పెంచుకునేందుకు అలా ఎక్కువ ధరకు పాడినట్లు అధికారులు గుర్తించారు.
ఆ అనుభవం నేపథ్యంలో హెచ్‌ఎండీఏ అప్రమత్తమైంది. తాజాగా డిపాజిట్ మొత్తాలను భారీగా పెంచింది. ఉదాహరణకు కోకాపేటలోని 8,591 చ.గజాల స్థలాన్ని వేలంలో దక్కించుకోవాలంటే రూ.5కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.



