ఆంధ్ర ప్రదేశ్

Vemulawada: స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లికి చెందిన వనపర్తి మహేందర్ అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో మరణించాడు. మృతుడు మహేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మహేందర్ అకాల మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిదిగా మిగిలింది.

ఈ క్రమంలోనే మృతుని స్నేహితులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. మిత్రుడి కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం వారంతా ఒక్కటై 2 లక్షల రూపాయల నగదును జమ చేసి బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేశారు. స్నేహితుడు తమ మధ్యలో లేకపోయినా ఆయన కుటుంబానికి మిత్రులు అండగా ఉండడంతో పలువరు అభినందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button