తెలంగాణ
Vikarabad: పోలీసులపై దురుసు ప్రవర్తన

Vikarabad: వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పై కొందరు వ్యక్తులు జులం ప్రదర్శించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని టాకీతండా రైల్వే గేటు వద్ద హెడ్ కానిస్టేబుళ్లు వాహనాల తనిఖీ చేపట్టగా అక్కడే హోటల్ నిర్వహిస్తున్న అరుణ్ అనే వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వాహనాల తనిఖీల కారణంగా తమ గిరాకీ దెబ్బతింటోందని పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో కానిస్టేబుళ్లతో దురుసగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



