ఆంధ్ర ప్రదేశ్
విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిఫ్ ప్రారంభం

విజయవాడలో రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిఫ్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ రవి నాయుడు, పీవీ సింధు పాల్గొన్నారు.
విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిఫ్లు జరగడం గర్వకారణమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.



