తెలంగాణ

Kokapeta: కోకాపేట భూములకు రికార్డు ధరలు.. ఎకరా రూ.137 కోట్లు

Kokapeta: గ్రేటర్ హైదరాబాద్‌లో భూములకు రెక్కలొచ్చాయి. HMDA నిర్వహించిన వేలం పాటలో రికార్డుస్థాయిలో ధరపలికింది కోకాపేట ల్యాండ్. నియోపోలిస్‌పై అందరి దృష్టి కేంద్రీకరించింది. నియోపోలిస్ ప్రాజెక్ట్‌లోని 17, 18 ప్లాట్‌లను బిడ్డింగ్ కోసం తీసుకోగా భారీ ధర పలికాయి. HMDA ప్రకటించిన ధరల ప్రకారం కోకాపేటకు ఎకరానికి ₹99 కోట్లు, గోల్డెన్ మైల్‌కు ఎకరానికి ₹70 కోట్లు, మూసాపేటకు ₹75 కోట్లు ఆఫ్‌సెట్ రేటు ఖరారు చేశారు.

అయితే కోకాపేట–నియోపోలిస్ కారిడార్‌లో రియల్ ఎస్టేట్ వేడి మరోసారి స్పష్టమైంది. రెండు ప్రధాన ప్లాట్లు అద్భుతమైన ధరలకు అమ్ముడై మార్కెట్‌కు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. 4.59 ఎకరాల ప్లాట్ నెంబర్ 17 ఎకరానికి 136.50 కోట్ల రికార్డు ధరతో మొత్తం 626.53 కోట్లకు దక్కించుకోగా 5.31 ఎకరాల ప్లాట్ నెంబర్ 18 మరింత ఆకర్షణీయంగా ఎకరానికి ₹137.25 కోట్లు పలికింది. మొత్తం 728.8 కోట్ల భారీ బిడ్డింగ్‌ను నమోదు చేసింది. హైటెక్ సిటీ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఇంకా పైకి ఎగబాకుతున్నదనడానికి ఇవే తాజా ఉదాహరణలు. కోకాపేట—నియోపోలిస్ కారిడార్ ఇప్పుడు నిజంగా బంగారం కంటే ఎక్కువ ధర పలుకుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button