ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రైతుల ముసుగులో వైసీపీ రాజకీయాలు

Chandrababu: అన్ని జిల్లాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. యూరియాకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు.
దారి మళ్లించిన వారిపై కేసులు నమోదు చేశామని, 3కోట్ల విలువైన యూరియాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ ఎరువులపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.



