తెలంగాణ
హైదరాబాద్ కొత్తపేట చౌరస్తాలో వీహెచ్‌పీ, బీజేపీ ఆందోళన

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న మారణహోమాన్ని ఖండిస్తూ హైదరాబాద్‌లోని కొత్తపేట చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్‌లో హింసకు పాల్పడుతున్న జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్ లో ఉన్న కేంద్ర రక్షణ రంగ సంస్థల చుట్టూ రోహింగ్యాలు అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇక్కడే శాశ్వత నివాసాలు ఏర్పండం ఆందోళనకర విషయమన్నారు వీహెచ్‌పీ నాయకులు అన్నారు. బాధిత హిందువులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



