Chiranjeevi: గ్యాంగ్‌స్టర్‌గా చిరు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీతో జతకట్టారు. మెగా 158గా రూపొందుతున్న ఈ చిత్రం కోల్‌కతా నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది. స్టోరీ ఫైనల్ అయింది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
మెగాస్టార్ చిరంజీవి వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘విశ్వంభర’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, శ్రీకాంత్ ఓదెల చిత్రాలతో పాటు ఇప్పుడు మెగా 158గా దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ)తో మళ్లీ కలిసారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తయారవుతోంది.
గతంలో చిరంజీవి కోల్‌కతా నేపథ్యంలో నటించిన ‘చూడాలని ఉంది’ బ్లాక్‌బస్టర్ కాగా, ఈ చిత్రంపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’తో బాబీ-చిరు కాంబో రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.



