News
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం తెలెత్తింది. పగలు ఎండ, సాయంత్రం వానతో జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది వాతావరణం. తెలంగాణలో ఇవాళ 16 జిల్లాలకు వర్షాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాతావరణ అధికారులు ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు.
నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ , రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తికి వర్ష సూచన ఉండగా నారాయణపేట, గద్వాలలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు.