తెలంగాణ
జడ్చర్ల దగ్గర రాంచందర్ రావు అరెస్ట్

జూరాల పర్యటనకు బయల్దేరిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్చర్ల దగ్గర రాంచందర్‌రావును అడ్డుకున్న పోలీసులు జూరాలకు వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నారు. ఉదయమే హైదరాబాద్ నుంచి జూరాలకు బయల్దేరిన రాంచందర్‌రావు స్థానిక రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని నిర్ణయించారు. జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచి రైతులకు నీటిని విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.



