ఆంధ్ర ప్రదేశ్
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. గుండిశెట్టిపల్లిలో హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. వరుసగా రెండో ఏడాది కుప్పానికి కృష్ణాజలాలు చేరడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అనంతరం తంబిగానిపల్లిలో రైతుబజార్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. కొత్తపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.. అలాగే కడపల్లిలో ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.



