ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 29 నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఈనెల 29న ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను విచారించనునున్నారు. 12 గంటలకు కాలె యాదయ్య, ఒంటిగంటకు మహిపాల్‌రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ విచారణకు హాజరుకానున్నారు. అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది.
కాగా, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒక్కో ఎమ్మెల్యే స్పీకర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానమిచ్చేందుకు ఈ నెల 30 వరకు గడువు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ను కోరినట్టు తెలుస్తోంది.



