ఆంధ్ర ప్రదేశ్

Anakapalli: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు

Anakapalli: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం సముద్రం తీరంలో చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు అయ్యాడు. ముత్యాలమ్మ పాలెం గ్రామంలో చేపల వేటకు వెళ్లిన మత్స్య కారుడు సూరాడ ముత్యాలు రాకాసి అలల తాకిడికి పడవ బోల్తా పడి గల్లంతయ్యాడు.

ముత్యాలు ఆచూకీ కోసం వెతుకుతున్నారు. పడవ బోల్తా పడ్డ సమయంలో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. గాయపడ్డవారిలో చింతకాయల పెంటయ్య తీవ్ర గాయాలతో ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాద వివరాలను తెలుసుకున్న పరవాడ పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button