ఆంధ్ర ప్రదేశ్
మాజీ మంత్రి రోజా కూతురు అరుదైన ఘనత

మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అందించే ప్రతిష్ఠాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు-2026 గెలుచుకున్నట్లు రోజా ట్వీట్ చేశారు. డ్రీమ్స్ నుంచి డెస్టినీ వరకు తన ప్రయాణం సాగుతోందని, ఇందుకు గర్వంగా ఉందని తెలిపారు. అకడమిక్స్‌లో అద్భుత ప్రదర్శన, లీడర్‌షిప్, క్యాంపస్‌కు చేసిన సేవకు గుర్తింపుగా వర్సిటీ ఏటా అవార్డు ఇస్తుంది.



