ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్ష

గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్షకు దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోవడంపై నిరసన తెలుపుతూ.. ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. అంబటి దీక్షకు వైసీపీ నేతలు, కార్యకర్తలు మద్దతు పలికారు. దాడి సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు.



