ఆంధ్ర ప్రదేశ్
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి

Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. స్టేషన్ అధికారులతో గొడవ పడిన వ్యక్తులు రైల్వే స్టేషన్ సమీపంలోనే పట్టాలపై కూర్చొని మద్యం సేవిస్తుండగా అదే సమయంలో వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. మృతులు చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందిన గంధం ముని కుమార్, కలికిరికి చెందిన వీరభద్రయ్య బాబుగా పోలీసులు గుర్తించారు.



