ఆంధ్ర ప్రదేశ్
Tirumala: అలిపిరి నడకదారిలో కొండచిలువ

Tirumala: తిరుమల అలిపిరి నడక దారిలో భారీ కొండచిలువ పాము హల్చల్ చేసింది. సుమారు పది అడుగుల పొడవు ఉన్న కొండచిలువ పాము నడకదారిలోని దుకాణంలోకి చొరబడింది. కొండ చిలువను చూసిన దుకాణదారులు, భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు.
స్పందించిన స్నేక్ క్యాచల్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పామును చాకచక్యంగా బంధించారు. పామును దట్టమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో అక్కడి దుకాణదారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.



