ఆంధ్ర ప్రదేశ్

Guntur: ఏపీలో ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

Guntur: పెళ్లైన కొన్ని నెలలకే ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లిలో నివాసం ఉంటున్న సీనియ‌ర్ అధికారి చిన్న రాముడు కుమార్తె మాధురి సాహితీబాయి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడుని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది.

వివాహమైన మూడో నెల నుంచే భర్త వేధిస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసుల సహకారంతో ఇటీవల కుమార్తెను ఇంటికి తీసుకొచ్చారు. తీవ్ర మనస్తాపానికి గురైన మాధురి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ఇలా అర్ధాంత‌రంగా జీవితాన్ని ముగించ‌డంతో ఐఏఎస్ అధికారి కుటుంబం క‌న్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button