ప్రభాస్ శుభాకాంక్షలతో ‘శంబాల’కు మరింత ఊపు!

Prabhas: క్రిస్మస్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్న ‘శంబాల’ చిత్రానికి రెబల్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన ‘శంబాల’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్‌కు ఈ చిత్రం భారీ బ్రేక్ ఇచ్చింది. సాలిడ్ వసూళ్లు, పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మరో బలమైన వీకెండ్ ను ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
‘ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టినందుకు ఆది అండ్ టీం కి కంగ్రాట్స్’ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రలు పోషించగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ నిర్మాతలుగా వ్యవహించారు. ప్రభాస్ బూస్ట్ తో ఈ చిత్రం మరింత భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.



